ఆ రోజు చిరంజీవి పట్టుబట్టలు పంపించారు: 'జబర్దస్త్' రామ్ ప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ రోజు చిరంజీవి పట్టుబట్టలు పంపించారు: 'జబర్దస్త్' రామ్ ప్రసాద్

  • చిరంజీవి ఓ నట శిఖరం 
  • ఆయన సినిమాలో చేస్తానని అనుకోలేదు 
  • ఆయనను గృహప్రవేశానికి ఆహ్వానించాను
  • నా జీవితంలో మరిచిపోలేని రోజు అది  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో 'జబర్దస్త్' రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. చిరంజీవి మూవీలో నటించే ఛాన్స్ రావడం గురించి .. తనకి ఆయన ఇచ్చిన గుర్తింపును గుర్తు చేసుకున్నాడు.

" చిరంజీవి నటనలో శిఖరం వంటివారు .. ఆయన సినిమాలో చేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. అలాంటి చిరంజీవి గారిని నా ఇంటి గృహ ప్రవేశానికి పిలవాలనిపించింది. ఆయన పీఏకి ఫోన్ చేసి మాట్లాడాను. ఇంటికి రమ్మంటే వెళ్లి కలిశాను .. ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చేశాం. అప్పుడు నేను .. నా భార్య పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. గృహ ప్రవేశం రోజున చిరంజీవి గారి ఇంటి నుంచి పట్టు బట్టలు .. బొకే వచ్చాయి. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు అది' అంటూ రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.  
ramprasad

More Telugu News