Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాద‌ర‌క్ష‌లు పోగొట్టుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి... కాసేపు ఇబ్బందిప‌డ్డ వెంక‌య్య‌నాయుడు

  • బెంగ‌ళూరులోని ఎంపీ పీసీ మోహ‌న్ ఇంట్లో పోయిన బూట్లు
  • వ‌ట్టి కాళ్ల‌తో కాసేపు ఉండాల్సిన ప‌రిస్థితి
  • వెంట‌నే వెళ్లి కొత్త షూస్ కొనుక్కొచ్చిన ర‌క్ష‌ణ సిబ్బంది
గుడికో, వేడుక‌కో వెళ్లిన‌ప్పుడు చెప్పులు పోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మన ఉప‌రాష్ట్ర‌ప‌తికి కూడా ఈ ఇబ్బంది త‌ప్ప‌లేదు. కొన్ని అధికారిక వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డానికి వెంక‌య్య‌నాయుడు బెంగ‌ళూరు విచ్చేశారు. అందులో భాగంగా స‌న్నిహితులు, ఇత‌ర కేంద్ర‌ మంత్రులు సదానంద గౌడ‌, అనంత్ కుమార్‌ లతో కలసి ఎంపీ పీసీ మోహ‌న్ ఇంట్లో స‌మావేశ‌మ‌య్యారు.

స‌మావేశం పూర్తై బ‌య‌టికొచ్చి చూసేస‌రికి ఆయ‌న షూస్ క‌నిపించ‌లేదు. దీంతో వ‌ట్టి కాళ్ల‌తోనే కాసేపు అటూ ఇటూ తిరగాల్సి వ‌చ్చింది. ఆయ‌న ర‌క్ష‌ణ సిబ్బంది ఎంపీ ఇంట్లో, ఆవ‌ర‌ణ‌లో ప్ర‌తి అంగుళం వెతికిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. పొర‌పాటున ఎవ‌రైనా వేసుకుని వెళ్లి ఉంటార‌ని భావించి, ఇక చేసేది లేక ద‌గ్గ‌ర‌లోని షోరూంకు వెళ్లి కొత్త షూస్ కొనుక్కుని వ‌చ్చారు.
vice president
Venkaiah Naidu
shoes

More Telugu News