బాలయ్య సినిమాలలో మూడవ స్థానంలో నిలిచిన 'జై సింహా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్య సినిమాలలో మూడవ స్థానంలో నిలిచిన 'జై సింహా'

  • తొలివారంలో బాలయ్య సినిమాల సందడి 
  • తొలిస్థానంలో 'శాతకర్ణి'
  • రెండవ స్థానంలో 'లెజెండ్'
  • మూడవ స్థానంలో 'జై సింహా
బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన 'జై సింహా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా, బీసీ సెంటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. తొలివారం అత్యధిక వసూళ్లను సాధించిన బాలకృష్ణ సినిమాల్లో, 'జై సింహా' మూడవ స్థానాన్ని దక్కించుకుంది.

 గతంలో బాలకృష్ణ చేసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తొలివారంలో 41 కోట్ల షేర్ ను రాబట్టి ఫస్టు ప్లేస్ లో నిలిచింది. ఇక 'లెజెండ్' విషయానికొస్తే 27 కోట్ల 40 లక్షల షేర్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక 23 కోట్ల 30 లక్షల షేర్ ను రాబట్టి ..' జై సింహా' మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 26వ తేదీ వరకూ వేరే సినిమాలేవీ లేకపోవడంతో, 'జై సింహా' లాభాల బాటపట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.  
balakrishna
nayanatara

More Telugu News