Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెల్మెట్లు ధరించని అభిమానులపై నటుడు సూర్య ఆగ్రహం

  • ‘గ్యాంగ్’ సక్సెస్ మీట్ లో భాగంగా చెన్నైలో పర్యటించిన సూర్య
  • అభిమానుల బైక్ ర్యాలీ .. హెల్మెట్లు ధరించని వైనం
  • అదుపు తప్పి సూర్య కారు కింద పడబోయిన ఓ బైక్
హెల్మెట్లు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించిన తన అభిమానులపై ప్రముఖ నటుడు సూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాళ్లకు ‘క్లాస్’ పీకాడు. సూర్య నటించిన తమిళ సినిమా ‘గ్యాంగ్’ సక్సెస్ మీట్ లో భాగంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో సూర్య సందడి చేశాడు. ఈ సందర్భంగా సూర్య అభిమానులు బైక్ లపై హెల్మెట్లు లేకుండా ర్యాలీ నిర్వహించారు.

 ఇది గమనించిన సూర్య తన కారులో నుంచి కిందకు దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్మెట్లు ధరించకుండా బైక్ లపై దూసుకెళుతున్నారని, ఆ బైక్ లలో ఒకటి అదుపు తప్పి తన కారు కింద పడబోయిందని, పొరపాటున వారికేమన్నా జరిగితే ఆ సంఘటన తనను జీవితాంతం వెంటాడుతుందని ఉద్వేగభరితంగా చెప్పాడు.
surya
gang

More Telugu News