క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలితను కొట్టినట్టుగా గుర్తులేదు: డైరెక్టర్ వంశీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలితను కొట్టినట్టుగా గుర్తులేదు: డైరెక్టర్ వంశీ

  • ఒక హీరోయిన్ ను కొట్టినట్టు గుర్తు 
  • జయలలితను కొట్టిన గుర్తు లేదు 
  • సరదాగా కొడితే కొట్టుండొచ్చునేమో
"ఇప్పుడున్న జనరేషన్ లో అవసరమైతే ఆర్టిస్టులను తేజ కొడుతూ వుంటారనే విషయాలను వింటూ ఉంటాం. అలాగే అప్పట్లో మీరు కూడా ఆర్టిస్టులను కొట్టేవారని అంటారు. ఒకసారి 'డిటెక్టివ్ నారద' సినిమా షూటింగ్ సమయంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలితను మీరు కొట్టారట .. నిజమేనా?' అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో దర్శకుడు వంశీకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. ' ఏదో సందర్భంలో ఇంకో హీరోయిన్ ను కొట్టినట్టుగా గుర్తుందిగానీ .. ఈవిడను కొట్టినట్టుగా నాకైతే గుర్తులేదు. జయలలితతో మంచి చనువు వుంది .. సరదాగా కొడితే కొట్టుండొచ్చు. ఎవరినైనా గానీ .. ఎప్పుడైనా గాని నిజంగా నేను ఆ పని చేసి వుండకూడదు' అన్నారు.   
vamsy

More Telugu News