Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ శృంగార తారకు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్ లో సన్నీ!

  • మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో సన్నీ మైనపు విగ్రహం
  • కొలతలు తీసుకున్న టుస్సాడ్స్ టీమ్
  • ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన నిపుణులు లండన్ నుంచి వచ్చి ముంబైలో సన్నీ లియోన్ ను కలిశారు. ఈ సందర్భంగా సన్నీకి సంబంధించిన దాదాపు 200 మెజర్మెంట్స్ తీసుకున్నారు.

మేడమ్ టుస్సాడ్స్ లో తన ప్రతిరూపాన్ని పెడుతుండటంపై సన్నీ సంతోషం వ్యక్తం చేసింది. తాను ఎంతో థ్రిల్ కు గురయ్యానని చెప్పింది. టుస్సాడ్స్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపింది. మ్యూజియంలో తన ప్రతిరూపాన్ని చూసేందుకు తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. ఇప్పటికే ఈ మ్యూజియంలో నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, హృతి రోషన్, సచిన్, కపిల్ దేవ్, సల్మాన్ ఖాన్ తదితరుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి సరసన సన్నీ కూడా చేరబోతోంది. 
Sunny Leone
sunny leone wax figure
bollywood

More Telugu News