ఆనర్ వ్యూ10 ఫోన్లకు కొత్త అప్డేట్... అందుబాటులోకి వచ్చిన ఫేస్ అన్లాక్
- జనవరి 24లోగా అప్డేట్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖం గుర్తింపు
- ఇదే బాటలో పయనించనున్న ఒప్పో, వన్ప్లస్
రూ. 29,999 విలువ గల ఈ ఆనర్ వ్యూ10 స్మార్ట్ఫోన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది. ఆక్టాకోర్ కిరిన్ 970 చిప్సెట్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ మెమొరీ ఉన్న ఈ స్మార్ట్ఫోన్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజర్ ముఖాన్ని, స్థానాన్ని గుర్తించి ఫోన్ను అన్లాక్ చేస్తుంది. ఇదే బాటలో వన్ప్లస్, ఒప్పోలు కూడా ఫేస్ అన్లాక్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.