Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలోని నవ్‌రంగ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నిమాపక సిబ్బందికి గాయాలు

  • శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట  ప్రాంతంలో ప్రమాదం
  • 8  ఫైరింజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది
  • ఖాళీగా ఉండడంతో తప్పిన ప్రాణాపాయం
ముంబై టోడి మిల్స్ సమీపంలోని లోయర్ పారెల్‌లో ఉన్న నవ్‌రంగ్ స్టూడియోలో గురువారం అర్ధరాత్రి దాటక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందిలో దినేశ్ పాటిల్ (26) అనే యువకుడు మంటలు అంటుకుని గాయపడగా వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నవ్‌రంగ్ స్టూడియో చాలా పురాతనమైనదే కాకుండా, ఖాళీగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రాథమిక సమాచారం బట్టి స్టూడియోలో ఎవరూ చిక్కుకోలేదని తెలుస్తోంది.

మంటలు అదుపు చేయడం తొలుత చాలా కష్టంగా మారిందని, బిల్డింగ్‌ను చేరుకునే వీలులేక ఇబ్బందులు పడినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మొత్తం 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసినట్టు తెలిపారు. అలాగే స్టూడియో చుట్టుపక్కల ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Navrang Studio
Mumbai
Fire

More Telugu News