చెవితో బెలూన్లు ఊదేస్తాడు... నమ్మకపోతే వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెవితో బెలూన్లు ఊదేస్తాడు... నమ్మకపోతే వీడియో చూడండి!

  • కొవ్వొత్తులు కూడా ఆర్పగ‌లుగుతున్న మ‌ణిశంక‌ర్ పాండే
  • ఏళ్ల త‌ర‌బ‌డి ప్రాక్టీస్ చేసి విజ‌యం
  • లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్ర‌య‌త్నం
బెలూన్లు ఊద‌డం అంద‌రికీ ఇష్ట‌మే. అంద‌రూ బెలూన్ల‌ను నోటితో ఊదుతుంటారు. కానీ ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన మ‌ణిశంక‌ర్ పాండే అందుకు భిన్నం. ఈయ‌న బెలూన్ల‌ను చెవితో ఊదుతారు. కేవ‌లం బెలూన్లు ఊద‌డం మాత్ర‌మే కాదు... కొవ్వొత్తుల‌ను కూడా చెవి నుంచి గాలి ఊది ఆర్ప‌గ‌ల‌డ‌ట‌.

సోన్‌బ‌ద్ర జిల్లాకు చెందిన మ‌ణిశంక‌ర్‌, ఈ చెవితో గాలి ఊదే క‌ళ‌లో నైపుణ్యం సంపాదించాడు. ఏళ్ల త‌ర‌బ‌డి సాధన చేసి తాను ఈ క‌ళ‌లో ప్రావీణ్యం సంపాదించిన‌ట్లు మ‌ణిశంక‌ర్ తెలిపారు. స‌రైన స‌హ‌కారం ల‌భిస్తే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదిస్తాడ‌ని, అందుకు ప్రోత్సాహం కావాల‌ని మ‌ణిశంక‌ర్ కుటుంబ‌స‌భ్యులు కోరారు.

ear
balloon
Uttar Pradesh
video
youtube

More Telugu News