సినీరంగ ప్రవేశం చేయబోతున్న అర్జున అవార్డు గ్రహీత దీపికా కుమారి
- మంత్రాలు చేస్తున్నారనే నెపంతో జరిగే హత్యలు కథాంశంగా చిత్రం
- జార్ఖండ్‌లో జరగనున్న షూటింగ్
- చిత్రం పేరు - బిసాహి
దీపిక స్వరాష్ట్రం జార్ఖండ్‌లో ఇప్పటికీ సామాజిక నేరంగా ఉన్న ఈ హత్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. జార్ఖండ్‌లోని పలు మారుమూల గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మొదట్లో ఈ చిత్రంలో నటించడానికి దీపిక సుముఖత వ్యక్తపరచలేదట.. కానీ స్క్రిప్ట్ చదివిన తర్వాత నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.