మందు మత్తులో అర్ధరాత్రి పోలీసుల ముందు నానాయాగీ చేసిన యువతి!
- హైదరాబాద్ లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
- పట్టుబడిన 59 మంది మందు బాబులు
- 34 కార్లు, 25 బైకులు సీజ్
బ్రీత్ టెస్టుకు సహకరించకుండా కారు తాళాలు తీసుకుని రోడ్లపై పరుగు తీసింది. తనకు పెద్దలు తెలుసునంటూ, వారితో ఫోన్లు చేయించింది. అతి కష్టం మీద ఆమెను అదుపు చేసిన పోలీసులు, బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపి మోతాదుకు మించి మందు కొట్టినట్టు తేల్చారు. ఈ తనిఖీల్లో మొత్తం 59 మంది పట్టుబడ్డారని, 34 కార్లు, 25 బైకులను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. పట్టుబడినవారిలో 10 మందికి పైగా యువతులు ఉండటం గమనార్హం.