నరసింహన్ వద్దు.. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించండి: రాజ్ నాథ్ కు బీజేపీ ఎంపీ లేఖ
- నరసింహన్ పై ఏపీలో పెరుగుతున్న వ్యతిరేకత
- గవర్నర్ ను మార్చాలంటున్న బీజేపీ నేతలు
- రాజ్ నాథ్ కు హరిబాబు లేఖ
తాజాగా బీజేపీ ఎంపీ హరిబాబు కూడా గవర్నర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని లేఖలో కోరారు. హరిబాబు లేఖ పట్ల కేంద్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.