Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప‌ద్మావ‌త్‌'లో చేసిన మార్పులివే!... పేరు మార్పుతో కొత్త ట్రైల‌ర్‌

  • ప్ర‌ద‌ర్శ‌నకు ముందు హెచ్చ‌రిక వేయాలి
  • ఘూమ‌ర్ పాట‌లో మార్పు
  • స‌తి ఆచారం సన్నివేశాల మార్పు
రాజ్‌పుత్ మ‌హారాణుల గౌర‌వానికి భంగం క‌లిగే స‌న్నివేశాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో ప‌ద్మావ‌త్ చిత్రం గురించి ఆందోళ‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు అంగీకారం తెల‌ప‌డం కోసం సీబీఎఫ్‌సీ చ‌రిత్ర‌కారుల స‌హాయం కూడా తీసుకుంది. వారి స‌ల‌హా మేర‌కు ఓ ఐదు మార్పుల‌ను సూచించింది. ఈ స‌వ‌ర‌ణ‌ల‌కు నిర్మాత‌లు ఒప్పుకుంటేనే సినిమా విడుద‌ల‌కు అంగీక‌రించిన‌ట్లు సీబీఎఫ్‌సీ చైర్మ‌న్ ప్ర‌సూన్ జోషీ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

పేరులో స్వ‌ల్ప మార్పుతో పాటు మ‌రో నాలుగు స‌వ‌ర‌ణ‌లు సీబీఎఫ్‌సీ సూచించింది. సినిమా ప్రారంభంలో డిస్‌క్లైమ‌ర్‌ ప్రదర్శించటం, సతి ఆచారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని, అలాగే ఘూమర్ పాటలో కూడా కొన్ని మార్పులు చేయాల‌ని సూచించింది. ఈ స‌వ‌ర‌ణ‌ల‌తో సినిమా ఇప్ప‌టికే సిద్ధంకాగా, పేరులో మార్పుతో ఉన్న చిత్రం ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు.
padmavat
deepika
sanjay

More Telugu News