అభిమానులకు షాక్.. గేటు దూకి తప్పించుకున్న తమిళ నటుడు సూర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానులకు షాక్.. గేటు దూకి తప్పించుకున్న తమిళ నటుడు సూర్య

  • రాజమహేంద్రవరంలో సందడి చేసిన సూర్య
  • ’గ్యాంగ్’ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న తమిళ నటుడు
  • అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు గేటు దూకిన స్టార్ హీరో
తమిళ హీరో సూర్య గేటు దూకి పారిపోయాడు. అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు ఓ సాధారణ వ్యక్తిలా గేటుపైకెక్కి కిందికి గెంతేశాడు. అభిమాన హీరో గేటు దూకడాన్ని చూసిన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. దీంతో సినిమా యూనిట్ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. అందులో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం చేరుకుని గ్యాంగ్ సినిమా ప్రదర్శితమవుతున్న మేనకా థియేటర్‌కు వెళ్లిన సూర్య కాసేపు హల్‌చల్ చేశాడు.

సూర్య వచ్చాడని తెలుసుకున్న అభిమానులు అప్పటికే పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారందరికీ హాయ్ చెప్పి లోపలికి వెళ్లిన సూర్య  కాసేపు సినిమా చూశాడు. అభిమానులతో ముచ్చటించాడు. కార్యక్రమం పూర్తయ్యాక బయటకు వచ్చిన ఆయన అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉండడాన్ని చూశాడు. దీంతో వెనక గేటు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ గేటుకు తాళం వేసి ఉండడంతో సాధారణ వ్యక్తిలా గేటు ఎక్కి కిందికి గెంతాడు. అది చూసిన అభిమానులు విస్తుపోయారు. ఓ స్టార్ హీరో ఇలా గేటు ఎక్కి దూకడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. బయటకు వచ్చిన సూర్య రెడీగా ఉన్న తన కారులో హైదరాబాద్ వెళ్లిపోయాడు.
kollywood
Gang
Suriya
Andhra Pradesh
Rajamahendravaram

More Telugu News