పాకిస్థాన్ కు దడ పుట్టించాలి: ఆర్మీ చీఫ్
- కశ్మీర్ విషయంలో రాజకీయ కార్యాచరణ అవసరం
- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి
- పొలిటికో-మిలిటరీ వైఖరిని అవలంబించాలి
రాజకీయ కార్యాచరణకు ఇతర కార్యాచరణలు తోడైతే కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని చెప్పారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మిలిటరీ ఒక భాగం మాత్రమేనని అన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల పని పట్టడం... వారి పట్ల ఆకర్షితులయ్యేవారి సంఖ్య పెరగకుండా చూడటమే తమ పని అని చెప్పారు.