తూర్పు గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు... ఇద్దరు డ్యాన్సర్ల అరెస్ట్!

  • సంబరాల ముసుగులో అశ్లీల నృత్యాలు
  • తూర్పు గోదావరి జిల్లా శంకగుప్తంలో ఏర్పాటు 
  • దాడులు జరిపిన పోలీసులు
వాడవాడలా సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా సాగుతున్న వేళ, సంబరాల ముసుగులో పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని మలికిపురం మండలం శంకగుప్తంలో కొందరు వ్యక్తులు అశ్లీల నృత్యాలకు తెరతీయగా, విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు జరిపారు. అక్కడ అసభ్యంగా నృత్యాలు చేస్తున్న ఇద్దరు డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు.

ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్న వారిపైనా దాడులు జరిపిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి రికార్డింగ్ డ్యాన్సులకూ అనుమతులు లేవని, అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Go Back to Shorts
Kakinada
Recording Dance
Dancers
Arrest

More Telugu News