నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త.. త్వరలో 6,500 ఉద్యోగాల భర్తీ

  • ఈనెల 20-24 మధ్య అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్
  • పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల నియామకం
  • హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లోనూ ఉద్యోగాల భర్తీ
ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ అమెజాన్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈనెల 20 నుంచి 24 వరకు ‘గ్రేట్ ఇండియా సేల్’ నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. అమెజాన్ ఇండియా పరిధిలోని నెట్‌వర్క్ సెంటర్లు, వినియోగదారుల నుంచి వచ్చిన ఆర్డర్లను సిద్ధం చేయడం, డెలివరీ చేయడంతోపాటు వివిధ విభాగాల్లో మొత్తం 5,500, వినియోగదారుల  సేవా కేంద్రంలో మరో వెయ్యి ఉద్యోగాలు కలిపి మొత్తం 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.

ఉద్యోగ నియామకాలతో వినియోగదారులకు మరింత వేగంగా వస్తువులను అందించేందుకు వీలవుతుందని అమెజాన్‌ ఇండియా ఉపాధ్యక్షుడు (కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌)అఖిల్‌ సక్సేనా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోనూ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Amazon
E-Commerce
Employment
Business

More Telugu News