తన అందంతో ఎరవేసే తమిళ నటి శ్రుతి తక్కువదేమీ కాదట... వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన అందంతో ఎరవేసే తమిళ నటి శ్రుతి తక్కువదేమీ కాదట... వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!

  • సోషల్ మీడియా ద్వారా యువకులకు పరిచయమయ్యే శ్రుతి
  • ప్రేమ, పెళ్లి పేరిట లక్షలు దండుకుని మోసం
  • సెల్ ఫోన్ కాంటాక్టుల ఆధారంగా విచారణ
  • ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు
తమిళనాట తన అందంతో ధనవంతుల బిడ్డలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేసి, వారి నుంచి లక్షల రూపాయలు గుంజుతూ పోలీసులకు పట్టుబడిన హీరోయిన్ శ్రుతిపై ఇప్పుడు మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇండియాలోని వారితో పాటు విదేశాల్లో ఉంటున్న తమిళుల నుంచి కూడా శ్రుతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందని పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని చాలా మంది, ఇప్పుడు పోలీసుల ముందుకు వస్తున్నారు. శ్రుతి సెల్ ఫోన్ లోని కాంటాక్టుల ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు, ఒక్కొక్కరి నుంచి ఆమె మోసాలకు సంబంధించిన వివరాలు లాగుతున్నారు. తాను వివాహం కోసం వెబ్ సైట్ లో వివరాలు పెడితే, శ్రుతి స్వయంగా ఫోన్ చేసి పరిచయం చేసుకుందని, ఆపై ప్రేమ పేరిట మోసం చేసి, తన కుటుంబీకుల వైద్య ఖర్చులంటూ ఎన్నో మార్లు లక్షల్లో డబ్బు తీసుకుందని ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు.

కోవైకి చెందిన ఓ ఇంజనీర్ యూఎస్ లో ఉండగా, అతనికి పెళ్లి ఆశ పెట్టి రూ. 15 లక్షలకు పైగా డబ్బు గుంజిందని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. ఆమె వల్ల మోసగింపబడిన వారి జాబితా చాలా పెద్దదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం శ్రుతి జైలులో ఉందన్న సంగతి తెలిసిందే.
Tamilnadu
Sruthi
Heroin

More Telugu News