మీరు యుద్ధానికి కాలుదువ్వితే.. అణుబాంబులేస్తాం!: ఇండియాకు పాక్ హెచ్చరిక
- ప్రభుత్వం అనుమతిస్తే అణుదాడి చేస్తామన్న బిపిన్ రావత్
- తీవ్రంగా స్పందించిన పాక్ విదేశాంగ మంత్రి
- కవ్విస్తే, తాము కూడా అణు బాంబు వేస్తామన్న ఖ్వాజా ఆసిఫ్
యుద్ధానికి కాలుదువ్వితే, తాము కూడా సిద్ధమేనని, భారత్ పై తీవ్ర స్థాయిలో అణు బాంబులు వేయగల సత్తా తమకుందని, ఈ విషయంలో రావత్ కు ఏమైనా అనుమానాలు ఉంటే, అవి త్వరలోనే తీరిపోతాయని అన్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాక్ పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రావత్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ ప్రతినిధి ఫైసల్ కూడా మండిపడ్డాడు. ఆయన మాటలను తేలికగా తీసుకోబోమని అన్నారు.