పాక్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న భారత్.. పరీక్షలకు సిద్ధమైన అగ్ని-5
- మరో నాలుగైదు రోజుల్లో అగ్ని-5 పరీక్ష
- 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
- పాక్ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి
- ఆస్ట్రేలియా, ఇండోనేషియాను అప్రమత్తం చేసిన భారత్
17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా తుత్తునియలు చేయగలదు. 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా పని కానిచ్చేయగలదు. అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అగ్ని-5 పరీక్షతో పాక్ గుండెల్లో గుబులు పుట్టడం ఖాయమని చెబుతున్నారు. పాక్ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని గుండెల్లో అప్పుడే గుబులు మొదలైంది.