నా భర్తే ఉత్తముడంటూ, నాగార్జునను ఆటపట్టించిన సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్తే ఉత్తముడంటూ, నాగార్జునను ఆటపట్టించిన సమంత!

  • అన్నపూర్ణ స్టూడియోస్ లో సంక్రాంతి సంబరాలు
  • వర్కర్స్ తో కలసి భోజనం చేసిన నాగ్ ఫ్యామిలీ
  • జోక్స్ తో అంతా ఉల్లాసం, ఉత్సాహమేనన్న నాగ్
పెద్ద కుమారుడికి వివాహమై ఇంటికి కొత్త కోడలు వచ్చింది. రెండో కుమారుడికి 'హలో' వంటి హిట్ వచ్చింది... అందుకే ఈ సంక్రాంతి తనకు వెరీ స్పెషల్ అంటున్నారు హీరో నాగార్జున. పిల్లలు సెటిల్‌ అయితే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పిన నాగ్, ఇంటికి కోడలు వచ్చాక జరుపుకుంటున్న తొలి సంక్రాంతి సంబరాలను ఎలా చేసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు.

అందరమూ అన్నపూర్ణా స్టూడియోలోనే కలిశామని, స్టూడియోను ప్రారంభించి 42 సంవత్సరాలు అయిన సందర్భంగా, ప్రతి ఒక్కరికీ సమంత భోజనాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ సమయంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి జోక్స్ వేసుకున్నామని అన్నారు. సమంత 'మై హస్బెండ్‌ ఈజ్‌ ది బెస్ట్‌' అనగానే, తామంతా షాక్‌ తిన్నామని చెప్పారు. ఆ వెంటనే "మేమందరం మా భార్యలకు మంచి భర్తలం కాదా?" అని అడుగగా, దానికి గడుసుగా "లేదు. మై హస్బెండ్‌ ఈజ్‌ ది బెస్టెస్ట్‌" అంటూ తామందరినీ ఆటపట్టించిందని అన్నారు.
Nagarjuna
Samantha
Sankranthi

More Telugu News