Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడులో అభిమానులు నాకు గుడి కట్టడాన్ని సపోర్టు చేస్తా: నటి నమిత

  • నాపై అభిమానులు చూపించే ప్రేమ, ఆప్యాయతలను గౌరవిస్తా
  • అభిమానులతో కలిసిపోయే తత్వం నాది
  • ఏ అభిమాని మనసును నేను బాధపెట్టలేదు
  • అందుకే, నేనంటే వారికి అభిమానం: నమిత
తమిళనాడులో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని సపోర్టు చేస్తానని, వారి భావాలను తాను అర్థం చేసుకోగలుగుతానని ప్రముఖ దక్షిణాది నటి నమిత అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో తన భర్త వీర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ, ‘నాపై అభిమానులు చూపించే ప్రేమ, ఆప్యాయతలను నేను గౌరవిస్తాను. అభిమానులతో మాట్లాడేందుకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒకవేళ నాకు ఒంట్లో బాగుండనప్పుడు నా ఫ్యాన్స్ ఎవరైనా నాతో ఫొటో దిగాలని అడిగితే వారికి ‘నో’ అని చెప్పను.

ఇంతవరకు ఏ అభిమాని మనసును నేను బాధపెట్టలేదు. అభిమానులతో కలిసిపోయే నా తత్వాన్ని వారు ఇష్టపడ్డారు’ అని పేర్కొంది. నమిత భర్త వీర్ మాట్లాడుతూ, ‘కోయంబత్తూరులో నమితకు వీరాభిమానులు ఉన్నారు. నమిత యాక్టింగ్, చేసే పాత్రలు, అందం, అమాయకత్వం.. వీటన్నింటిని చూసి అభిమానులు ఆమెను బాగా ప్రేమించారు. అందుకే, ఆమెకు గుడి కట్టించారు’ అని అన్నారు.
namitha
Tamilnadu

More Telugu News