Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో నాగార్జునను చూసి ‘ఎంతటి అందగాడో!’ అని ఆశ్చర్యపోయా: నటి నమిత

  • టీవీలో ‘ఖుదాగవా’లో నాగార్జునను మొట్టమొదటిసారి చూశా
  • అప్పుడు నాకు ఎనిమిది లేదా తొమ్మిదేళ్లు
  • ‘ఓ మై గాడ్! ఇతను ఎంత అందంగా ఉన్నాడు’ అని అనుకున్నా
  • ఓ ఇంటర్వ్యూలో నమిత
‘ఖుదాగవా’లో హీరో నాగార్జునను చూసి ‘ఎంతటి అందగాడో!’ అని ఆశ్చర్యపోయానంటూ తన చిన్ననాటి విషయాన్ని ప్రముఖ దక్షిణాది నటి నమిత జ్ఞాపకం చేసుకుంది. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో నమిత, తన భర్త వీర్ తో కలిసి మాట్లాడింది. ‘నేను మొట్టమొదటిసారి నాగార్జునను టీవీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లను. నాకు ఎనిమిది లేదా తొమ్మిదేళ్లుంటాయి. ఆ సందర్భం నాకు బాగా గుర్తుంది. నేను పుట్టి పెరిగిన ఓల్డ్ హవేలిలో.. అక్కడి ఇంట్లో డోర్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు .. టీవీలో హిందీ మూవీ ‘ఖుదాగవా’లో శ్రీదేవి పాటను మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ చూస్తున్నారు.

అప్పుడు, నాగార్జునను చూసి..‘ఓ మై గాడ్! ఇతను ఎంత అందంగా ఉన్నాడు!’ అని అనుకున్నా’ అని చెప్పుకొచ్చింది. ‘మీ భర్త వీరాను నాగార్జునలా ఉన్నారని అందరూ అంటుంటారు. అందుకే, అతన్ని చేసుకున్నారా?’ అనే ప్రశ్నకు నమిత స్పందిస్తూ, ‘అది అనుకోకుండా జరిగింది. ఆ దేవుడు నా ప్రార్థనలు విన్నాడు. అందుకే, అలాంటి అందమైన మొగుడిని ఇచ్చాడు’ అంటూ నవ్వులు చిందించింది.
Nagarjuna
namita

More Telugu News