హైదరాబాద్ నుంచి విశాఖకు రూ. 18 వేలు, విజయవాడకు రూ. 12,931... దోపిడీకి దిగిన ఎయిర్ లైన్స్!
- ఇప్పటికే అడ్డగోలు దోపిడీకి దిగిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్
- రైళ్లలో వెయిటింగ్ లిస్టు చాంతాడంత
- బిజీగా కనిపిస్తున్న ఎయిర్ పోర్టు
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి కౌంటర్లు చాలా బిజీగా కనిపిస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, పలువురు ప్రయాణానికి రెడీ అవుతుండడం వల్ల, ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు డైనమిక్ ప్రైసింగ్ విధానానికి తెర తీశాయని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంత ధరపై కూడా టికెట్ లను కొనుక్కొని వెళుతున్న వారు కనిపిస్తుండటం గమనార్హం.