ఏపీని కట్ చేస్తావా? ఏం మాటలవి?... మంత్రి మాణిక్యాలరావుపై ప.గో. జడ్పీ చైర్మన్ బాపిరాజు ఫైర్
- మంత్రిపై విరుచుకుపడిన బాపిరాజు
- నోరు జారడం, వెనక్కి తగ్గడం ఆయనకు అలవాటేనని వ్యాఖ్య
- అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్
తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ బాపిరాజుపై మండిపడ్డారు. తాను నిత్యం ముఖ్యమంత్రి పక్కన కూర్చునే వ్యక్తినని, తన నియోజకవర్గానికి వచ్చే నిధులను, పనులను బాపిరాజు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోసారి అలా చేస్తే తాను మగాడినో, కాదో తేల్చుకుంటానని తీవ్రస్థాయిలో బాపిరాజును ఉద్దేశించి మంత్రి హెచ్చరించారు.