తెలంగాణ మంత్రివర్గంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ మంత్రివర్గంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణ‌ ఉద్య‌మంతో సంబంధం లేని వారు మంత్రివ‌ర్గంలో ఉన్నారు
  • అది త‌లుచుకుంటే క‌ళ్ల‌నుంచి నీళ్లు వ‌స్తున్నాయి
  • టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని కొంద‌రు అనుకున్నారు
  • ఆ స‌మ‌యంలో కేసీఆర్.. ఇష్టంలేక‌పోయినా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు
గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టినవారే ఇప్పుడు రాష్ట్ర మంత్రివ‌ర్గంలో కొనసాగుతున్నారంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు మ‌ర‌వక ముందే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా తాజాగా అటువంటి వ్యాఖ్య‌లే చేశారు. తెలంగాణ‌ ఉద్య‌మంతో సంబంధం లేని వారు తెలంగాణ‌ మంత్రివ‌ర్గంలో ఉన్నార‌ని, అది త‌లుచుకుంటే త‌న క‌ళ్ల‌నుంచి నీళ్లు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని అప్పట్లోనే ప‌డ‌గొట్టాల‌ని కొంద‌రు అనుకున్నారని, ఆ స‌మ‌యంలో కేసీఆర్.. రాష్ట్ర కేబినెట్ విషయంలో ఇష్టంలేక‌పోయినా  కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని అన్నారు. కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Telangana
srinivas goud
TRS

More Telugu News