ఒంటి శుభ్రత లేని భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకెక్కిన తైవాన్ పౌరుడు!
- ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తుంటుంది
- ఉదయం పళ్లు తోముకోదు
- కాపురం చేయలేను... విడాకులు ఇప్పించాలంటూ విన్నపం
బాధితుడు కోర్టు ముందుంచిన అంశాలను చూస్తే... ‘‘ప్రేమించుకునే సమయంలో నా ప్రియురాలు వారానికోసారి స్నానం చేసేది. పెళ్లయిన తర్వాత ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తోంది. అది కూడా ఆరు గంటల సమయం తీసుకుంటోంది. రోజూ ఉదయం పళ్లను శుభ్రం చేసుకునే అలవాటు కూడా లేదు. ఉద్యోగం చేయవద్దంటూ పోరు పెడుతోంది. దాంతో ఉద్యోగం మానేసి మరో ప్రాంతానికి వెళ్లగా, వెతుక్కుంటూ అక్కడకు కూడా వచ్చి మరీ వేధిస్తోంది. ఆమెతో నేను కాపురం చేయలేను’’ అంటూ విడాకులు కోరుతున్న వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు.