అభిమానుల కాళ్ల‌కు 'సూర్య' న‌మ‌స్కారం... వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానుల కాళ్ల‌కు 'సూర్య' న‌మ‌స్కారం... వీడియో చూడండి!

  • కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో ఘ‌ట‌న‌
  • అభిమానులు కాళ్లు ప‌ట్టుకోవ‌డం చూసి అంద‌రూ షాక్‌
  • కాస్త ఇబ్బంది ప‌డిన న‌టుడు
అభిమానుల‌ను ఆద‌రించ‌డంలో త‌మిళ హీరోలు మిగ‌తా భాష‌ల సినీ హీరోల‌తో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటారు. అభిమానం త‌ట్టుకోలేక ఒక్క‌సారిగా త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన వారిని చిరాకు ప‌డ‌కుండా ప్రేమ‌గా ఆద‌రిస్తుంటారు. విక్ర‌మ్ ఓ అభిమానిని కౌగిలించుకోవ‌డం, అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు న‌టుడు కార్తీ హాజ‌రై ఏడ‌వ‌డం ఇలా చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల సూర్య కొత్త చిత్రం 'గ్యాంగ్‌' త‌మిళ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది.

వేదిక మీద‌కి ఒక్క‌సారిగా వ‌చ్చి అభిమానులు సూర్య పాదాల‌కు న‌మ‌స్కారం చేశారు. దీంతో కాస్త ఇబ్బంది పడిన సూర్య వెంటనే వారి కాళ్లకు నమస్కరించారు. ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించడం చూసి అక్కడి వారు షాకయ్యారు.
suriya
gang

More Telugu News