ఆర్మీ డే రిహార్సల్స్‌లో అపశ్రుతి.. హెలికాప్టర్ నుంచి అదుపుతప్పి కిందపడిన జవాన్లు.. వీడియో చూడండి!
- గాయాలపాలైన ముగ్గురు జవాన్లు
- జనవరి 15న జరగనున్న ఆర్మీ డే
- ప్రదర్శనల కోసం రిహార్సల్స్ చేస్తున్న జవాన్లు
అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. హెలికాప్టర్ మీది నుంచి సైనికులు కింద పడడం, మూడో సైనికుడు చాలా ఎత్తు నుంచి కిందపడటం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన కారణాలపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప బాధ్యతలు తీసుకున్న జ్ఞాపకంగా ప్రతి ఏడాది జనవరి 15న ఈ ఆర్మీ డే నిర్వహిస్తారు.