Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

12 బ్యాంకుల మొబైల్ యాప్స్ కు భద్రతా ముప్పు... కస్టమర్లకు హెచ్చరిక సందేశాలు!

  • సురక్షిత విధానంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగించాలి
  • ఖాతాదారులకు బ్యాంకుల సూచన
  • జాబితాలో యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ, ఐసీఐసీఐ సహా పలు ఇతర యాప్స్
12 బ్యాంకుల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లకు సెక్యూరిటీ ముప్పు ఉందంటూ బయటపడడంతో ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ను సురక్షిత విధానాల్లో నిర్వహించాలని సూచిస్తున్నాయి. 232 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన ఆండ్రాయిడ్ యాప్స్ ను ట్రోజన్ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సైబర్ భద్రతా ఉత్పత్తుల సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ గుర్తించింది. దీంతో బ్యాంకులు మాల్వేర్ పై హెచ్చరిస్తూ తమ ఖాతాదారులకు సందేశాలు పంపిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరుతో పిలిచే ఈ మాల్వేర్ ను కస్టమర్ల లాగిన్ వివరాలు కొట్టేయడానికి, వారి మొబైల్ కు వచ్చే ఎస్ఎంఎస్ లను హైజాక్ చేసేందుకు, నకిలీ నోటిఫికేషన్లు పంపేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు క్విక్ హీల్ గుర్తించింది. నకిలీ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ మాల్వేర్ చొరబడుతున్నట్టు తేలింది. క్విక్ హీల్ తన జాబితాలో పేర్కొన్న భారత బ్యాంకుల యాప్స్ ను చూస్తే... యాక్సిస్ మొబైల్, హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్, ఎస్ బీఐ ఫ్రీడమ్ ప్లస్(ఎస్ బీఐ ఎనీవేర్), హెచ్ డీఎఫ్ సీ క్విక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఐ మొబైల్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్ ప్లస్, ఐడీబీఐ బ్యాంకు అభయ్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్, ఐడీబీఐ ఎంపాస్ బుక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం పాస్ బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ యాప్ ఉన్నాయి.
mobile banking
threat
apps

More Telugu News