Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాత్రివేళల్లో చెన్నై వీధుల్లో తిరిగాను .. రోడ్డు పక్కన టీ కొట్లో టీ తాగాను: హీరో సూర్య

  • రేపు విడుదలవుతోన్న 'గ్యాంగ్'
  • దర్శకుడిగా విఘ్నేష్ శివన్ 
  • కథానాయికగా కీర్తి సురేశ్   
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' తెరకెక్కింది. తమిళంలో రేపు విడుదలవుతోన్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను కూడా రేపే 'గ్యాంగ్' పేరుతో పలకరించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్న సూర్య మాట్లాడుతూ," మొదటిసారిగా కథ తీసుకుని విఘ్నేష్ శివన్ నా దగ్గరికి వచ్చినప్పుడు, 'సార్ మీరు రోడ్ పై నడిచి .. రోడ్డు పక్కనే గల టీ కొట్లో టీ తాగి ఎంతకాలమైంది?' అని అడిగాడు'.

పాత రోజులను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ 'చాలాకాలమే అయింది' అన్నాను. 'మిమ్మల్ని మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లే కథ సార్ ఇది' అన్నాడు. అంతే, ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. పాత్రను అర్థం చేసుకోవడానికి రాత్రివేళల్లో చెన్నై వీధుల్లో తిరిగాను. రోడ్డు పక్కనే గల టీ స్టాల్స్ లో టీ తాగుతూ, అక్కడి మనుషులను .. వాతావరణాన్ని గమనించేవాడిని' అంటూ సూర్య చెప్పుకొచ్చారు.    
surya
keerthi suresh

More Telugu News