కోహ్లీ బాటలో పాండ్యా... ఓ బాలీవుడ్ భామతో సహజీవనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ బాటలో పాండ్యా... ఓ బాలీవుడ్ భామతో సహజీవనం!

  • ఎల్లి అవ్రామ్ పేరు ప్రచారంలోకి
  • సామాజిక మాధ్యమాల్లో వీరి సన్నిహిత ఫొటోలు
  • పాండ్యా సోదరుడి వివాహానికీ హాజరు
క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఈ మధ్య కాలంలో డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య పరిణీతి చోప్రాతో పాండ్యా డేటింగ్ లో ఉన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, అది అవాస్తవమని తేలిపోయింది. అయితే, పాండ్యా డేటింగ్ లో ఉన్నట్టు మరోసారి వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరు...? అన్న ప్రశ్నలకు కనిపిస్తున్న సమాధానం స్వీడన్ జాతీయురాలు, నటి ఎల్లి అవ్రామ్.

 బిగ్ బాస్7 సిరీస్ లో పాల్గొన్న ఎల్లి, కిస్కో ప్యార్ కరూన్, పోస్టర్ బాయ్స్ సహా పలు చిత్రాల్లో నటించింది. అలాగే, ప్రస్తుతం పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. గడిచిన డిసెంబర్ లో జరిగిన పాండ్యా సోదరుడు కృనాల్ వివాహానికి ఎల్లి హాజరు కావడం తెలిసిందే. అలాగే, పాండ్యా, ఎల్లి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ రావడంతో వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మ చాలా కాలం సహజీవనం తర్వాత దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Pandya
elli avram

More Telugu News