Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంత అందానికి కారణం ఇదేనట!

  • గ్లామర్ రహస్యాన్ని వెల్లడించిన సమంత
  • శామ్ సీక్రెట్ 'యాపిల్ సిడర్ వెనిగర్'
  • గూగుల్ లో ఎన్నో రెసిపీలు ఉన్నాయంటూ సూచన
'దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ' అంటూ 'జనతా గ్యారేజ్' సినిమాలో సమంత గురించి రామజోగయ్య శాస్త్రి పాటను రాశారు. ఈ పాట సమంతకు కరెక్ట్ గా సరిపోతుంది. అందరినీ ఆకట్టుకునే అందం ఆమెది. ఎంతో మంది అమ్మాయిలు సమంతలా మెరిసిపోవాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు.

తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ను సమంత బయటపెట్టింది. 'యాపిల్ సిడర్ వెనిగర్' తన అందం వెనుకున్న రహస్యం అని ఈ అక్కినేని వారి కోడలు తెలిపింది. 'ప్రతి రోజూ ఉదయం పరగడుపున యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోండి' అంటూ తన అభిమానులకు సూచించింది. గూగుల్ లో వెతికితే మరెన్నో రెసిపీలు కనపడతాయని చెప్పింది.
samantha
tollywood
kollywood
samntha glamour secret

More Telugu News