Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గ్యాంగ్' మూవీ రిలీజ్ కోసమే రమ్యకృష్ణ వెయిటింగ్!

  • సూర్య తాజా చిత్రంగా 'గ్యాంగ్'
  • తెలుగు .. తమిళ భాషల్లో రేపే రిలీజ్ 
  • కీలమైన పాత్రలో రమ్యకృష్ణ
తెలుగు తెరపై నిన్నటి తరం అందాల కథానాయికగా రమ్యకృష్ణ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. అలాంటి రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో తన వయసుకు తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. 'బాహుబలి' లో ఆమె చేసిన 'శివగామి' పాత్ర .. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' భార్యగా ఆమె చూపిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

దాంతో తమ సినిమాలో మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఉంటే, ముందుగా రమ్యకృష్ణనే సంప్రదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్థాయికి తగిన కొన్ని పాత్రలను రమ్యకృష్ణ చేస్తూ వచ్చారు. అయితే అవేవి అంతగా ఆమె క్రేజ్ ను పై మెట్టుకు తీసుకెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సూర్య 'గ్యాంగ్' సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర చేశారు. ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పైనే రమ్యకృష్ణ ఆశలు పెట్టుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. 
surya
keerthi suresh

More Telugu News