ఆధార్‌కి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వర్చువల్ ఐడీ తీసుకురానున్న యూఐడీఏఐ
- వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా ఉండే సదుపాయం
- 16 అంకెల వర్చువల్ ఐడీతో ఆధార్ ఆధారిత సేవలు
- మార్చి చివర్లోగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచన
ఈ వర్చువల్ ఐడీని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగదారుడు జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఐడీలో వినియోగదారుడి ఆధార్ వివరాలు ఉంటాయి. అవసరం తీరిపోయిన తర్వాత ఈ ఐడీ నిర్వీర్యమవుతుంది. ఆధార్ సర్వర్ హ్యాక్ అయిన కారణంగా దేశంలో ఉన్న అందరి వివరాలు తప్పుడు పనులకు ఉపయోగపడే అవకాశం ఉందని, ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛ మీద భరోసా ఇవ్వలేకపోతోందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.