చిరంజీవితో అందుకే సినిమా చేయలేదు!: గౌతమి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవితో అందుకే సినిమా చేయలేదు!: గౌతమి

  • చిరంజీవి జోడీగా అవకాశాలు వచ్చాయి 
  • ప్రతిసారి డేట్స్ సమస్య వచ్చింది 
  • అప్పుడు చాలా బాధగా అనిపించేది  
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం కథానాయికగా పేరు తెచ్చుకున్న వారిలో గౌతమి ఒకరు. నాజూకైన కథానాయిక అనిపించుకున్న ఆమె, అప్పట్లో చిరంజీవితో మాత్రం నటించలేదు. అందుకు గల కారణం ఏమిటనే ప్రశ్న గౌతమికి ఐ డ్రీమ్స్ నుంచి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .."చిరంజీవితో చేయమంటూ ఓ మూడు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. ప్రతిసారి డేట్స్ సమస్య తలెత్తుతూ వచ్చింది. ఒక సినిమా కమిటైన తరువాత .. ఆ తరువాత పెద్ద ప్రాజెక్టు నుంచి ఆఫర్ వచ్చినా ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ కే కట్టుబడి వుంటాను. అందువలన చిరంజీవి గారితో కలిసి నటించలేకపోయానే గానీ మరే కారణమూ లేదు. ఇక మంచి అవకాశాలను వదులుకోవలసి వచ్చినప్పుడు అందరిలానే నాకూ బాధగా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.    
gautami

More Telugu News