Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంటవెంటనే హిట్స్ పడలేదు .. అదే మైనస్ అయింది: నవదీప్

  • సినిమా నేపథ్యం వుంటే బాగుంటుంది 
  • లేకపోయినా ఫరవాలేదనడానికి రవితేజ .. నాని ఉన్నారు
  • నితిన్ .. ఉదయ్ కిరణ్ లకు మంచి హిట్స్ పడ్డాయి
తెలుగు తెరకి హీరోగా పరిచయమైన నవదీప్, ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకి, "సినిమా నేపథ్యం లేకపోవడమే మీరు ఆశించిన స్థాయి సక్సెస్ ను సాధించకపోవడానికి కారణమని అనుకుంటున్నారా?" అనే ప్రశ్న ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ " సినిమా నేపథ్యం వుంటే ప్లాప్ వచ్చినా .. హిట్ వచ్చినా వరుసగా సినిమాలు ఉంటాయి. ఇక ఎలాంటి నేపథ్యం లేకుండగా వచ్చిన వాళ్లలో రవితేజ .. నాని కనిపిస్తూనే వున్నారు. నేను ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ఇదొక్కటే కారణం కాదు. మొదటి మూడు నాలుగు సినిమాలు హిట్ అయిన కారణంగా మంచి గుర్తింపు రావడం యువ హీరోల విషయంలో జరుగుతూ ఉంటుంది. నితిన్ .. ఉదయ్ కిరణ్ కెరియర్ తొలినాళ్లలో చేసిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. నా విషయంలో అది జరగకపోవడమే మైనస్ అని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 
navadeep

More Telugu News