'అజ్ఞాతవాసి'లో వెంకీ సీన్స్ తరువాత చేరుస్తారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అజ్ఞాతవాసి'లో వెంకీ సీన్స్ తరువాత చేరుస్తారట!

  • భారీ ఓపెనింగ్స్ తో 'అజ్ఞాతవాసి'
  • గెస్ట్ రోల్ లో కనిపించని వెంకటేశ్ 
  • ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్    
భారీ అంచనాల మధ్య 'అజ్ఞాతవాసి' సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్ లో ఓ నాలుగు నిమిషాల పాటు కనిపించనున్నాడనే టాక్ కొన్ని రోజుల క్రితం వచ్చింది. ఆ పాత్రకి సంబంధించిన షూటింగులో వెంకటేశ్ పాల్గొన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

 అయితే ఈ రోజున థియేటర్స్ లోకి వచ్చిన 'అసజ్ఞాతవాసి' సినిమాలో వెంకీ కనిపించకపోవడం ఆయన అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించింది. ఈ సినిమాలో వెంకటేశ్ చేయలేదేమో .. గతంలో వచ్చిన వార్తల్లో నిజం లేదేమోనని అనుకునేవారు లేకపోలేదు. అయితే వెంకటేశ్ చేసిన సీన్స్ ను త్వరలో యాడ్ చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    
venkatesh

More Telugu News