ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సోషల్ మీడియా ద్వారా బుకింగ్ సదుపాయం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సోషల్ మీడియా ద్వారా బుకింగ్ సదుపాయం!

  • ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా బుకింగ్ సదుపాయం
  • లాగిన్ అయి బుక్ చేసుకోవడమే
  • ఆన్ లైన్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు
ఇండేన్ గ్యాస్ యాజమాన్యం తన వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది. ఇకపై సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా ఇండేన్ గ్యాస్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్విట్టర్ ద్వారా బుక్ చేసుకోవాలంటే...
ట్విట్టర్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత refill @indanerefill అంటూ ట్వీట్ చేయాలి. ఆ తర్వాత పేరు, ఈ మెయిల్, ఎల్పీజీ నంబర్ ను నమోదు చేయాలి. మొదటిసారి ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నవారు register LPGID అని ట్వీట్ చేయాలి.

ఫేస్ బుక్ ద్వారా బుక్ చేసుకునేవారు...
ఫేస్ బుక్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేజ్ ను ఓపెన్ చేయాలి. కుడివైపు బాక్స్ లో 'బుక్ నౌ' అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి, పేరు, ఈ మెయిల్, ఎల్పీజీ నంబర్ ను నమోదు చేయాలి. ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బు చెల్లించే అవకాశం ఉంది. 
indane gas
indane gas booking

More Telugu News