హైదరాబాద్ లో యువతి దారుణ హత్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో యువతి దారుణ హత్య!

  • కూకట్ పల్లిలో పని చేస్తున్న యువతి
  • ప్రేమ పేరుతో వేధించిన ఆనంద్ అనే యువకుడు
  • అతనే హత్య చేసి ఉంటాడని అనుమానం
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగుడు కత్తులతో పొడిచి, దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్ లో ఉంటోంది. కూకట్ పల్లిలోని డీమార్ట్ లో ఆమె పని చేస్తోంది.

ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె స్నేహితురాళ్లు తెలిపారు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ గతంలో అనేక సార్లు బెదిరించాడని, అతనే జానకిని హత్య చేసి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
women murder

More Telugu News