'ఆధార్' భారీ లోపం... ఏ బ్యాంకులో ఖాతా ఉందో 'ఓటీపీ' లేకుండానే తెలిసిపోతోంది... ట్రై చేస్తారా?
- లోపాన్ని పసిగట్టిన టెక్కీలు
- ఆధార్ నంబర్ తెలిస్తే చాలట
- 50 పైసలతోనే బ్యాంకు వివరాలు
మీ ఫోన్ నుంచి *99*99*1# అని టైప్ చేయాలి. దీనికి 50 పైసల చార్జ్ పడుతుంది.
ఆపై మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాలన్న డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
అక్కడ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి, ఆపై కన్ఫర్మ్ చేయాలి. వెంటనే ఏఏ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానమై ఉందో డిస్ ప్లే అవుతుంది. ఈ విధానంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం లేదు సరికదా, 'ఓటీపీ'తోనూ అవసరం రాదు. మీరూ ట్రై చేసి చూడండి!