మూడో అంత‌స్తు ఎక్కి.. కిటికీ ప‌గుల‌కొట్టి గ‌ర్భిణిని కాపాడిన వ్య‌క్తి.. మీరూ చూడండి!

మూడో అంత‌స్తులో మంటల్లో చిక్కుకుపోతోన్న ఓ గర్భిణిని ఓ వ్యక్తి కాపాడిన ఘటన చైనాలోని హెనాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. గమనించిన అపార్ట్ మెంటులోని వారంతా కిందకు వచ్చేవారు. కానీ, ఓ ఫ్లాట్‌లో ఓ గర్భిణి మాత్రం రాలేకపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అపార్ట్ మెంటు వెనక వైపు నుంచి మూడో అంతస్తు వరకు ఎక్కి కిటికీ పగులకొట్టి అందులోంచి ఆ మహిళను బయటకు వచ్చేలా చేసి కిందికి దించాడు. అతడికి రెస్క్యూ సిబ్బంది కింది నుంచి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీసులు విడుదల చేశారు. 
Go Back to Shorts
Pregnant woman
rescued
China

More Telugu News