శీతల పానీయం ఫ్రూటీ ప్ర‌క‌ట‌న‌లో న‌టించ‌బోతున్న అల్లు అర్జున్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శీతల పానీయం ఫ్రూటీ ప్ర‌క‌ట‌న‌లో న‌టించ‌బోతున్న అల్లు అర్జున్‌!

  • ద‌క్షిణాది ప్ర‌చార‌క‌ర్త‌గా నియామ‌కం
  • ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించిన పార్లే ఆగ్రో
  • ద‌క్షిణాదిలో మార్కెట్ పెంచుకునే యోచ‌న‌
ప్ర‌ముఖ శీత‌ల పానీయాల విక్ర‌య సంస్థ పార్లే ఆగ్రో ద‌క్షిణాదిలో త‌మ మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్‌ని త‌మ ప్ర‌చార‌క‌ర్తగా ఎంచుకుంది. వారి ఫ్రూటీ ప్ర‌క‌ట‌న‌లో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్న‌ట్లు పార్లే ఆగ్రో జాయింట్ ఎండీ, సీఎంవో న‌దియా చౌహ‌న్ తెలిపారు.

ద‌క్షిణాదిలో అతిపెద్ద మార్కెట్‌ కలిగిన పార్లే ఆగ్రో.. ఫ్రూటీ, యాపీ, ఫ్రూటీ ఫిజ్‌, యాపీ ఫిజ్‌, బెయిలీ, ఫ్రియో వంటి శీతల పానీయాలను విక్రయిస్తోంది. మ‌రోవైపు అల్లు అర్జున్ చేతిలో ఇప్ప‌టికే కొన్ని ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌క‌ట‌న‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న డ్యాన్సింగ్ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ చేసిన కంపెనీల ప్ర‌క‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.
frooti
Allu Arjun
parle agro

More Telugu News