ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ రోజున నా ప్రాణాలు పోయేవే: రామ్ జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ రోజున నా ప్రాణాలు పోయేవే: రామ్ జగన్

  • గోదావరిలోకి సరదాగా దూకాను 
  • అక్కడ తాటిచెట్టు లోతు వుంది 
  • శ్రీకాంత్ తో పాటు అంతా కలిసి కాపాడారు  
తెలుగు తెరపైనా .. బుల్లితెరపైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ జగన్, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. ఓ షూటింగులో తనకి ఎదురైన ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు. "శ్రీకాంత్ హీరోగా 'ఊరికి మొనగాడు' అనే సినిమా షూటింగ్ 'కూళ్ల' సమీపంలోని గోదావరి తీరంలో జరుగుతోంది. ఓ రోజు మధ్యాహ్నం తరువాత షూటింగు ఉండటంతో, శ్రీకాంత్ .. నేను .. ఉత్తేజ్ .. వైజాగ్ ప్రసాద్ కలిసి బోట్ లో అవతల ఒడ్డుకు వెళ్లి వద్దామని అనుకుని బయలుదేరాం.

అలా బోట్ లో వెళుతూ వుండగా .. ఒక్కసారిగా శ్రీకాంత్ గోదావరిలోకి దూకాడు. ఆయన మంచి ఈతగాడు .. ఆయన చెస్ట్ వరకే వాటర్ రావడంతో, ధైర్యం చేసి ఈత రాకపోయినా నేనూ దూకేశాను. అలా నేను కొంత ముందుకు వెళ్లే సరికి ఒక్కసారిగా లోపలికి వెళ్లిపోయాను ..  అక్కడ ఒక తాటిచెట్టు లోతు వుంది. ప్రాణభయం ఎలా ఉంటుందనేది మొదటిసారిగా నాకు తెలిసింది. శ్రీకాంత్ తో పాటు అంతా కలిసి నన్ను కాపాడారు .. లేదంటే ఆ రోజే నా ప్రాణాలు పోయేవి" అంటూ చెప్పుకొచ్చారు. 
ram jagan
srikanth

More Telugu News