హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా శుభవార్త.. 7.5 లక్షల మంది భారతీయులకు ఉపశమనం

  • వీసా పొడిగింపు నిబంధనల్లో ఇక మార్పుల్లేవ్
  • గ్రీన్ కార్డ్ వచ్చేలోగా హెచ్ 1బీ వీసాలను ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు
  • యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రకటన
అమెరికాలో ప‌ని చేస్తోన్న 7.5 లక్షల మంది భారతీయులకు ఉపశమనం కలిగిస్తూ అమెరికా శుభవార్త చెప్పింది. హెచ్ 1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం లేదని, వీసా పొడిగింపు నిబంధనల్లో మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్ 1 బీ వీసాను ఆరేళ్లకు మించి పొడగించకుండా, సెక్షన్ 104సీ లో మార్పులు చేయాలని మొదట భావించిన విషయం తెలిసిందే.

అయితే, దీనిపై వ్యతిరేకత వస్తుండడంతో తన నిర్ణయాన్ని విరమించుకుంది. ఈ మేరకు యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రకటన చేసింది. ఇక అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకున్న హెచ్ 1బీ వీసాలను ఎన్ని సార్లయినా పొడిగించుకునే అవకాశం ఉండనుంది.
Go Back to Shorts
america
good news
indias

More Telugu News