నాకు ఊహ తెలిసిన నాటినుంచే సినిమా పిచ్చి వుంది: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఊహ తెలిసిన నాటినుంచే సినిమా పిచ్చి వుంది: ఆమని

  • సినిమాలు బాగా చూసే దానిని
  • హీరోయిన్స్ ను అనుకరించే దానిని 
  • శ్రీదేవి .. జయసుధ .. జయప్రద అంటే ఇష్టం
"సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీ ఇంట్లో ఆ దిశగా ఆసక్తిని చూపించినదెవరు?" అనే ప్రశ్న ఆమనికి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకామె సమాధానమిస్తూ .. "కన్నడ .. తమిళ భాషలకి సంబంధించి మా నాన్న డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవారు. నన్ను సినిమాల్లోకి పంపించాలనే ఆలోచన ఆయనకి అసలే లేదు".

"ఇక మా అమ్మ సినిమాలు చూస్తుంది గానీ, నటన వైపుగా నన్ను తీసుకెళ్లాలని అనుకోలేదు. ఇక ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమా పిచ్చే. ఏ సినిమా చూసినా .. ఇంటికి వచ్చాక అద్దం ముందు కూర్చుని ఆ హీరోయిన్ లా నటించడానికి ప్రయత్నం చేసే దానిని. కొంత కాలం తరువాత మా అమ్మకి తెలిసి నాకు సపోర్ట్ చేసింది. శ్రీదేవి .. జయప్రద .. జయసుధ అంటే నాకెంతో ఇష్టం. వాళ్ల సినిమాలు తప్పకుండా చూసేదానిని .. వాళ్లలా నటించడానికి ట్రై చేసే దానిని" అంటూ చెప్పుకొచ్చారు.
amani

More Telugu News