Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ డైరెక్టర్ ఆ సినిమాలో నుంచి నన్ను తీసేస్తానన్నాడు: చిన్నా

  • 'పుట్టింటి పట్టుచీర' షూటింగ్ జరుగుతోంది 
  • కాస్ట్యూమర్ శాలువా తీసుకురాలేదు 
  • డైరెక్టర్ ఆ కోపం నాపై చూపించాడు 
  • షూటింగ్ ఆపేశాడు  
చిన్నా కెరియర్లో ఆయనకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'పుట్టింటి పట్టుచీర'. ఆ సినిమా దర్శకుడు బోయిన సుబ్బారావు తనని కసురుకున్నాడంటూ, ఆ సంఘటనను గురించి ఐ డ్రీమ్స్ లో చిన్నా చెప్పుకొచ్చారు. " పుట్టింటి పట్టుచీర' షూటింగ్ చేస్తున్నాం .. దాంట్లో నాకు ఒక చెయ్యి ఉండదు. అందువలన శాలువా కప్పుకుని కనిపిస్తాను. హైదరాబాద్ లో ఓ రోజున ఉదయం నేను .. యమున .. సురేశ్ షూటింగ్ చేస్తున్నాం.

"జనం విపరీతంగా రావడంతో .. కంట్రోల్ చేయలేక సుబ్బారావుగారికి బీపీ వచ్చేసింది. కాస్ట్యూమర్ శాలువా తీసుకురావడం మరిచిపోయాడు. సుబ్బారావుగారు నన్ను అడిగితే, 'అది నా పనికాదు సార్ .. కాస్ట్యూమర్ తేలేదు' అని చెప్పాను. దాంతో 'నీ బిహేవియర్ బాగోలేదంటూ నన్ను కసురుకోవడం మొదలుపెట్టాడు. 'నిన్ను ఈ పాత్రలో నుంచి తీసేస్తాను అంటే .. మీ ఇష్టం అన్నాను. కోపంతో ఆయన షూటింగ్ ఆపేశాడు .. ఇంచార్జ్ ప్రొడ్యూసర్ అయిన సురేశ్ బాబు సర్దిచెప్పడంతో మళ్లీ షూటింగ్ మొదలైంది. ఆ సినిమా హిట్ తో అన్ని గొడవలూ మర్చిపోయాం' అంటూ చెప్పారు.       
chinna

More Telugu News