చేస్తే హీరోయిన్ గా చేస్తాను .. లేదంటే లేదు అని తేల్చి చెప్పేశాను: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చేస్తే హీరోయిన్ గా చేస్తాను .. లేదంటే లేదు అని తేల్చి చెప్పేశాను: ఆమని

  • చెన్నై వాతావరణం పడలేదు 
  • అయినా ప్రయత్నాలు మొదలుపెట్టాను 
  • సిస్టర్ పాత్రలు .. ఫ్రెండ్ పాత్రలకి అడిగారు 
  • చేయనంటే చేయనని చెప్పాను  
హీరోయిన్ కావాలనే పట్టుదలతో చెన్నై వెళ్లిన ఆమని .. తనకి ఎదురైన పరిస్థితులను గురించి ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. " బెంగుళూర్ నుంచి వెళ్లడం వలన చెన్నై వాతావరణం మాకు చాలా కష్టంగా అనిపించింది. అయినా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. కొన్ని కంపెనీల వాళ్లు స్టిల్స్ చూసి నన్ను పిలిపించేవాళ్లు ..  రంగు తక్కువగా వున్నానని అనుకునేవాళ్లు.

 కొంతమంది నువ్వే హీరోయిన్ అనేవారు. మరుసటి రోజు వెళితే, 'సారీ అమ్మా హీరోయిన్ రోల్ వేరే అమ్మాయికి ఇచ్చేశాం .. సిస్టర్ రోల్ వుంది చేస్తావా?'  సినిమా మొత్తం ఉంటుంది .. అని అడిగేవారు. కొంతమందేమో ఫ్రెండ్ పాత్ర చేయమని అనేవారు. చేయననే విషయాన్ని ఇంటికి వచ్చాక ఫోన్ చేసి చెప్పేదాన్ని. చేస్తే హీరోయిన్ గా చేస్తాను .. లేదంటే ఇంటికి వెళ్లిపోదాం .. చదువును కంటిన్యూ చేస్తాను' అని మా అమ్మతో కూడా తేల్చి చెప్పేశాను. డబ్బు కోసం నేను చిన్న చిన్న పాత్రలు చేయను అని స్పష్టం చేశాను' అని చెప్పుకొచ్చారు.  
amani

More Telugu News