Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'శివ' సినిమా కోసం నన్ను తీసుకోవద్దని ఆయన వర్మతో చెప్పాడు: చిన్నా

  • శివనాగేశ్వర రావు నాకు అడ్డు పడ్డాడు 
  • 'శివ'లో ఛాన్స్ పోయిందనుకున్నాను
  • ఆ తరువాత శివనాగేశ్వర రావు సారీ చెప్పాడు   
'శివ' సినిమాలో చేసిన పాత్రనే చిన్నాకి అసలు పేరుగా మారిపోయింది. ఆ సినిమా గురించి 'ఆలీతో సరదాగా'లో ప్రస్తావిస్తూ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. " 'శివ' సినిమా కోసం నన్ను చెన్నైలో సెలెక్ట్ చేశారు. అక్కడ నాకు పెద్ద విలన్ గా తగిలింది ఎవరయ్యా అంటే కో డైరెక్టర్ శివనాగేశ్వర రావు. 'వీడసలు నటుడే కాదు .. వీడు వద్దు' అని ఆయన వర్మకు చెప్పేశాడు.

 'మంచి నటుడు .. నాకైతే నచ్చేశాడు' అని వర్మగారు అన్నారు. 'వద్దు రాము .. ఏదో ఒక సీన్ నేర్చుకుని వచ్చి నీ ముందు చేస్తున్నాడు .. ఈ పాత్రను ఇస్తే మాత్రం ఇబ్బంది పెట్టేస్తాడు' అని శివనాగేశ్వరరావు అన్నాడు. అయినా నేను ఓకే అనే విషయాన్ని వర్మ నాకు చెప్పేశాడు. వీడియో షూట్  వున్న రోజున అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. వర్మ గారు నన్ను చూడగానే 'ఏంటి ఆ రోజులా లేవు .. ఏదో తేడాగా వున్నావ్' అని అడిగారు'. 'అంతే .. ఇక నా కేరక్టర్ పోయిందనుకున్నాను'. 'అంతకు ముందు వేసుకు వచ్చిన డ్రెస్ వేసుకుని రమ్మన్నారు .. అలా వెళ్లి కనిపించాక ఓకే అన్నారు. వీడియో షూట్ తరువాత ఆ పాత్రకి నన్ను ఓకే చేశారు. ఆ తరువాత శివనాగేశ్వర రావు నాకు సారీ చెప్పారు' అన్నారు.  
chinna

More Telugu News