ఒకేరోజు విడుదల కాబోతున్న ప్యాడ్ మ్యాన్, పద్మావత్... స్పందించిన అక్షయ్ కుమార్
- సానుకూలత వ్యక్తం చేసిన అక్షయ్ కుమార్
- ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుందని వ్యాఖ్య
- ఎప్పుడైనా విడుదల చేసుకునే హక్కు నిర్మాతలకు ఉందన్న నటుడు
ఈ విషయంపై అక్షయ్ కుమార్ తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. పద్మావత్ విడుదల అవబోతుండటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని సానుకూలంగా స్పందించారు. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుందని, సినీ నిర్మాతలకు తమ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునే హక్కు ఉంటుందని అక్షయ్ అన్నారు. సినిమాల మధ్య పోటీ అనే సమస్య ఉండదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విడుదల తేదీ గురించి 'పద్మావత్' చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.